పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సలహాలు

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సలహాలు

ప్రకాశం: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజబాబు ఆదివారం సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు.