పిన్నెల్లి సోదరులపై జూలకంటి ఫైర్
PLD: ప్రభుత్వ కరెంటుతో నీళ్లు అమ్ముకున్న నీచమైన మనస్తత్వం పిన్నెల్లి సోదరులదని ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ అయ్యారు. శనివారం వెల్దుర్తి మండల కేంద్రంలో జూలకంటి మాట్లాడుతూ.. పిన్నెల్లి నాకు డబ్బులు ఇచ్చినట్లు చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయగలవా అని సవాల్ విసిరారు. మీలాగా కల్తీ మందు అమ్మించలేదని, కరోనా సమయంలో మీ లెక్కరు దోపిడి ప్రజలందరికీ తెలుసన్నారు.