CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన 120 మంది బాధితులకు సుమారు రూ.97.47 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకొని ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం అందని వారికి సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు.