ముఖారవిందానికి మొక్కజొన్న

ముఖారవిందానికి మొక్కజొన్న

ఈ సీజన్‌లో విరివిగా లభించే మొక్కజొన్నతో అందాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కప్పు తాజా మొక్కజొన్న పిండిలో కాస్త తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి నలుగులా రాసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. పచ్చి మొక్కజొన్న గింజల్ని పేస్ట్‌లా చేసుకుని, దానికి కాస్త గులాబీ నీరు, చెంచా తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.