మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

W.G: అత్తిలి మండలం కొమ్మర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం ఎంపీడీవో పి.శామ్యూల్‌ పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.