సీనియర్ల ఆరోపణలు..యువతి మృతి
TG: వరంగల్ కేయూలో ఆత్మహత్యయత్నం చేసిన పీజీ విద్యార్థిని శ్రీవిద్య మృతి చెందింది. సీనియర్లు దొంగతనం నెపం మోపారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేయగా.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. శ్రీవిద్య స్వస్థలం ఖమ్మం జిల్లా బనిగండ్లపాడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.