ఎమ్మెల్యే శ్రావణి నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే శ్రావణి నేటి పర్యటన వివరాలు

ATP: శింగనమల నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అడుగులు వేస్తున్నారు. ప్రతి మండలంలో ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాలను చేపట్టి, ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని, అధికారుల సమక్షంలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం పుట్లూరులో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు క్యాంపు కార్యాలయం పేర్కొంది.