కాళేశ్వరం తీర్పుపై BRS విమర్శలు
GDWL: కాళేశ్వరం అంశంపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలు బయటపడ్డాయని BRS నేత బాసు హనుమంతు నాయుడు విమర్శించారు. గద్వాలలో మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావులపై కమిషన్ పేరుతో వేధింపులు జరిగాయని ఆరోపించారు. కోర్టు కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని స్పష్టం చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.