రేమద్దుల గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం: మంత్రి
WNP: పాన్గల్ మండలం రేమద్దుల గ్రామంలో కాంగ్రెస్, CPM బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి రేగి చెట్టు నిరంజన్ తరఫున మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. పేదల పక్షపాతి, మనకు అందుబాటులో ఉండే నిరంజన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. నిరంజన్‌ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.