బీజేపీకి విరాళాల వెళ్లువ
దేశంలో అత్యధిక విరాళాలు పొందుతున్న పార్టీగా BJP నిలిచింది. గతేడాది ఆ పార్టీ పలు విధాలుగా రూ.6,074.015 కోట్ల మేర విరాళాలు పొందినట్లు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రూ.5,717.167 కోట్లు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చినట్లు చెప్పింది. అలాగే కాంగ్రెస్‌కు రూ.517 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.27 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీకి రూ.2 కోట్లు సమకూరినట్లు తెలిపింది.