మందసలో ప్రపంచ జానపద దినోత్సవం

SKLM: మందస మండలం బహడపల్లి గ్రామంలో 22న ప్రపంచ జానపద దినోత్సవం వేడుకలను జరిపిస్తున్నట్లు సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక నిర్వాహకులు గురునాథ్ బుధవారం ప్రకటించారు. జానపద కళలే పునరుజ్జీవనమే ధ్యేయంగా, జానపద కళలకు జవాసత్వాలు కల్పించడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. అంతరించిపోతున్న కళలకు ఈ వేదిక ద్వారా ఊపిరిపోయాలని అన్నారు.