VIDEO: గుండ్లవాగు ప్రాజెక్టు మత్తడి పోయడంతో రైతుల హర్షం

MLG: గోవిందరావుపేట మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి శనివారం గుండ్లవాగు ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. దీంతో రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదని జలాశయాల వద్దకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.