చెరుకు రసంతో లాభాలెన్నో..!

చెరుకు రసంతో లాభాలెన్నో..!

చెరుకు రసం అనేక పోషకాలను కలిగి ఉంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. చెరుకు రసంలో ఉండే కాల్షియం, పొటాషియం ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. కాగా, దీనిని మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.