'ఫిర్యాదులను పరిష్కరించండి'
ELR: పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఉంగుటూరు ఎంపీడీవో జీయర్ మనోజ్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. శాఖల వారీగా వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పాల్గొన్నారు.