కొడంగల్ 11వ వార్డు కాంగ్రెస్ విజయం
VKB: కొడంగల్ మున్సిపాలిటీ 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల అనిత నర్సింహులు ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఆమె గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా 10 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. BRS& MIM పార్టీలు తలో ఒక స్థానం గెలిచాయి.