ఇసుక వివాదం.. అధికారుల తనిఖీ
NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఆధ్వర్యంలో అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ, జన్కంపేట్ గ్రామాల మధ్య నెలకొన్న ఇసుక రీచ్ వివాదంపై సబ్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, వేల్పూర్ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బంది కలిసి ఉమ్మడిగా పరిశీలన జరిపారు.