ఈనెల 12న ఉదయగిరిలో వైసీపీ మహాధర్నా
NLR: ఈనెల 12వ తేదీన ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలోని ఉదయగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.