VIDEO: అశ్వ వాహనంపై స్వామివారి ఊరేగింపు
JGL: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణతో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలతో,గోవింద నామస్మరణతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కళకళలాడింది.ప్రత్యేక పూజలు హారతుల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.