VIDEO: ఉప్పాడ కోతకు ప్రత్యక్ష నిదర్శనం ఈ బావి
KKD: సముద్రపు కెరటాల కోతకు గురై కాకినాడలోని ఉప్పాడ గ్రామం రోజురోజుకు సముద్రంలో కలిసిపోతోంది. ఈ ప్రాంతంలో ఇళ్లన్నీ క్రమంగా పడిపోతున్నాయి. అయితే స్థానిక పాత మార్కెట్ సమీపంలో ఒక పాత బావి మాత్రం కెరటాల ధాటికి తట్టుకుని నిలబడుతోంది. మట్టి కొట్టుకుపోయినా పైకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని కెరటాలు తాకినా ఈ బావి వాటిని తట్టుకుని నిలబడడం విశేషం.