VIDEO: ఎస్పీ ఆఫీసులో నూతన భవనాల ప్రారంభం
GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన కాన్ఫరెన్స్ హాల్‌ను గురువారం ప్రారంభించారు. అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కోసం నిర్మించిన కొత్త భవనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఏపీ విట్ యూనివర్సిటీ ఛాన్సలర్ కలిసి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ నూతన భవనాలతో ప్రజల సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కానుంది.