ఆరు నెలలు నిరసన.. కరుణ చూపని ఎమ్మెల్యే

ఆరు నెలలు నిరసన.. కరుణ చూపని ఎమ్మెల్యే

MHBD: సీపీఎం పార్టీ తొర్రూరు మండలం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా నిరసన తెలుపుతున్న మహిళలపై ఎమ్మెల్యే కరుణ చూపకపోవడం విడ్డూరమని విమర్శించారు. ఇళ్లు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.