బీసీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో ఈశ్వర చారికి నివాళులు
SRPT: బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర చారికి నేరేడుచర్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల హామీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని డిమాండ్ చేశారు.