గుడ్లవల్లేరులో మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం

గుడ్లవల్లేరులో మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడ్లవల్లేరు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల బదిలీపై వచ్చిన వారికి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల, చిన్నపిల్లల రక్షణపై చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలికలపై వేధింపులు, గృహ హింస, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్సై సూచించారు.