బంగారు బ్రాస్లెట్‌ను భద్రపరిచిన పోలీసులు
HNK: గత నెల 30న వచ్చిన వరదల సమయంలో అలంకార్ ప్రాంతంలో రవి అనే వ్యక్తికి బంగారు బ్రాస్లెట్ దొరకగా, ఆయన దానిని హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ రవిని అభినందించి, తమ బ్రాస్లెట్ పోయిందనుకునే వారు సరైన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.