ఇళ్లలోకి నీరు.. భయాందోళనలో ప్రజలు
KDP: అధిక వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు సిద్దవటం మండలం తురకపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వర్షపు రావడంతో గృహ నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి నీరు చేరడంతో విషపురుగులు సంచరిస్తూ భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు. అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.