తగ్గిన ఉష్ణోగ్రతలు.. ఆకట్టుకుంటున్న మంచు దృశ్యాలు
అల్లూరి: ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. మినుములూరులో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు. మరోవైపు నగరంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. వంజంగిలోని మేఘాలకొండలో మంచు దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను వారంతా తమ ఫోన్‌లలో బంధిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.