ఊపందుకున్న వరి సాగు పనులు

ఊపందుకున్న వరి సాగు పనులు

ADB: వర్షం రాకతో రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వరణుడు మొఖం చాటేయడంతో ఈ ఏడాది పంట పొలాలు సాగులోకి వస్తాయో లేదో అని రైతన్నలు ఆందోళన చెందారు.ఈ తరుణంలో వాతావరణం శాఖ వర్షాలు కురుస్తాయని శుభవార్త చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూర్ మండలంతో పాటు చుట్టూ పక్క మండలాలలో వ్యవసాయ పనులు ముమ్మరం చేయడంతో పనులు ఊపందుకున్నాయి.