సముదాయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

సముదాయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

TPT: నారాయణవనం మండలం సముదాయంలోని శ్రీకృష్ణ భజన మందిరంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీ వేణుగోపాల స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వద్ద నిర్వాహకులు, యాదవ సంఘం వారు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.