నేడు కనిగిరిలో జాబ్ మేళా
ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.