వార్డుల సంఖ్య పెంచాలని ఎంపీడీవోకు వినతి

JGL: బుగ్గారం మండల కేంద్రంలో బుగ్గారం గ్రామపంచాయతీలో పెరిగిన ఓటర్ల ప్రాతిపాదికన వార్డుల సంఖ్య పెంచాలని మంగళవారం గ్రామస్థలు ఎంపీడీవో అబ్జల్ మియాకి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న 12 వార్డుల సంఖ్యలను 16 పెంచాలని, వార్డుల సంఖ్య పెంచడానికి జెడ్పీ సీఈవో, జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.