కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళన

కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళన

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మార్క్‌ఫెడ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో మార్కెట్‌లో క్రయవిక్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమ పంటలను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు.