రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్
SDPT: రూరల్ మండలం తోర్నాల 33 కేవీ ఫీడర్ పరిధిలో మెయింటెనెన్స్ పనులు ఉన్నందున గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. ఇరుకోడు, బూరుగుపల్లి, తోర్నాల, వెంకటాపూర్, బుస్సాపూర్ గ్రామాలతోపాటు వ్యవసాయ ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.