VIDEO: జిల్లాలో భానుడి భగభగ
ADB: జిల్లాలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో ఉంది. భానుడి భగభగలకు వేడి గాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు 40°C - 42°C మధ్య నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకీ ఎండలు మండుతుండడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో 41°C ఉష్ణోగ్రత నమోదయింది.