విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన కలెక్టర్

CTR: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ వెంకటేశ్వర్ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన ఇంద్రజ, సేవిత, వందన, కేతన్‌లకు కలెక్టర్ ట్యాబ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా.. పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ స్థాయిలో నిలబడటం అభినందనీయమన్నారు.