ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలి

KRNL: C. బెళగల్ మండలంలో రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 30 లోపు కేవైసీ పూర్తి చేయాలని తహసీల్దార్ పురుషోత్తం తెలిపారు. సోమవారం ఆయన సి. బెళగల్‌లో మాట్లాడుతూ.. మండలంలోని 41 రేషన్ షాపులలో 18,141 కార్డులు ఉండగా, 5, 489 కార్డులకు కేవైసీ అవసరం ఉందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్లు కలిసి ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.