స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి: కలెక్టర్

మన్యం జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.