పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్
W.G: నరసాపురం 10 వార్డు జ్యోషుల వారి వీధి శివారు ప్రాంతంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3840 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి.యాదగిరి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.