మత్స్య సంపద అభివృద్ధి కోరుతూ గంగపుత్రుల ప్రార్థనలు

మత్స్య సంపద అభివృద్ధి కోరుతూ గంగపుత్రుల ప్రార్థనలు

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో గంగపుత్రుల సమాజం ఆధ్వర్యంలో వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, తెప్పోత్సవం నిర్వహించి, చీర, సారె, పసుపు-కుంకుమలు సమర్పించారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు పాడిపంటలు, మత్స్య సంపద అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా సాగింది.