చిరుతను తరిమి కొట్టిన బాలుడు

చిరుతను తరిమి కొట్టిన బాలుడు

చిరుత దాడి చేసినా భయపడకుండా ఓ పదకొండేళ్ల బాలుడు దానిని తరిమి కొట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటుచేసుకుంది. కాంచడ్ ప్రాంతంలో పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కువారా అనే బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన బాలుడు గట్టిగా కేకలు వేస్తూ తన స్నేహితుడితో కలిసి చిరుతపై రాళ్లు విసిరాడు. స్థానికులు కూడా కర్రలు తీసుకుని రావడంతో చిరుత పారిపోయింది.