నిరుపేదలకు భూపట్టాలు ఇవ్వాలి.. సీపీఎం

నిరుపేదలకు భూపట్టాలు ఇవ్వాలి.. సీపీఎం

KMR: నిరుపేదలందరికీ భూపట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ బుధవారం డిమాండ్ చేశారు. భిక్కనూర్ జంగంపల్లి గ్రామ పరిధిలోగల నిరుపేద కుటుంబాలను ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి వెంటనే పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు.