బనగానపల్లెలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ పీట్ల గంగాధర్ అనే అంతర్రాష్ట్ర దొంగను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు. గంగాధర్ స్వగ్రామం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓంశాంతి నగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు నాగరాజు ఇంట్లో గంగాధర్ 20 తులాల బంగారం నగదును దోచుకెళ్లాడు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.