జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆత్రం సుగుణ

ADB: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని TPCC ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. గ్రామాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల సమయంలో చెరువులు, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయకుండా ఉండాలన్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యలో పాల్గొనాలని సూచించారు.