ఉమ్మడి వరంగల్ పంచాయతీరాజ్‌కు 130 ఏళ్లు పూర్తి

ఉమ్మడి వరంగల్ పంచాయతీరాజ్‌కు 130 ఏళ్లు పూర్తి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థ 130 ఏళ్ల ఘన ప్రస్థానం పూర్తి చేసుకుంది. హైదరాబాద్ పంచాయతీ చట్టం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణంలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సులు, మండల వ్యవస్థ ఏర్పాటుతో పంచాయతీలు బలోపేతమయ్యాయి. తండాలకు పంచాయతీ హోదా లభించడంతో గ్రామ పంచాయతీల సంఖ్య 567 నుంచి 1708కి పెరిగింది.