పాత గంజాయి కేసులో ముద్దాయి అరెస్టు

VSP: గత కొంతకాలం పోలీసుల కళ్ళుకప్పి తిరుగుతున్న వ్యక్తి పై ముందస్తు సమాచారం రావడంతో కేడీపేట ఎస్సై తారకేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి పాతకేడిపేట ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ముద్దాయి నల్లపాటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా తెల్లబెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని అన్నారు. సదరు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడమైనదన్నారు.