బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MBNR: రాజపూర్ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన దుల్ల కృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం బీఆర్ఎస్ నాయకుడు చించోడు అభిమన్యు రెడ్డి సూచన మేరకు స్థానిక నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆయన అందించిన రూ. 5వేలను బాధిత కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులోను కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.