BREAKING: ఎన్నికల షెడ్యూల్ విడుదల

BREAKING: ఎన్నికల షెడ్యూల్ విడుదల

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాలకు, పుదుచ్చేరి (UT)కి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసోం, కేరళల్లో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.