గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన నాంపెల్లి అనూష (30) బుధవారం మనస్తాపంతో గడ్డి మందు తాగి మృతి చెందింది. తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, భర్త మానసిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె తల్లిదండ్రుల వద్దే నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటోంది. కాపురానికి వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.