12 చోట్ల ఉప సర్పంచ్ ఎన్నికలు.!
MDK: జిల్లాలో నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ ఎన్నిక జరగనిచోట ఈరోజు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 142 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా 12 చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు కొన్ని అనివార్య కారణాలవల్ల జరగలేదని డీపీఓ యాదయ్య తెలిపారు. ఈరోజు వార్డు సభ్యులకు నోటీసు జారీ చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు.