ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

NZB: జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. నిన్న ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలన్నారు.