బందరు పోర్టుకు రూ. 573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు

బందరు పోర్టుకు రూ. 573.77 కోట్ల రహదారి ప్రాజెక్టు

కృష్ణా: బందరు పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 573.77 కోట్లతో భారీ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. NH–65, NH–216 జంక్షన్లను నేరుగా పోర్టుతో అనుసంధానిస్తూ 6 లేన్ల ప్రధాన రహదారి, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక భారీ రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.